బ్యాంక్ వినియోగదారులకు కీలకమైన నివేదిక ఈరోజు నుంచి వరుస నాలుగు రోజుల వరకు బ్యాంకులు మూసివేయబడతాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిబంధనల ప్రకారం, డిసెంబర్ 28, 29న దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు కాగా..డిసెంబర్ 30, 31 న కూడా పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు సెలవు దినాలు ప్రకటించారు. ఢిల్లీ, యుపి, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మొదలైన రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.సెలవు దినాలలో బ్యాంకింగ్ సేవల కోసం వినియోగదారులు ఆన్లైన్ బ్యాంకింగ్ను ఉపయోగించుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ , ATM సేవలు వంటి డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. నగదు ఉపసంహరణ, చెక్ క్లియరెన్స్, ఇతర బ్యాంకింగ్ పనులు పని వేళలో మాత్రమే చేయబడతాయి.
సెలవు దినాలు ..
డిసెంబర్ 28: నాల్గవ శనివారం
డిసెంబర్ 29: ఆదివారం
డిసెంబర్ 30: U Kiang Nangbah వర్ధంతి సందర్భంగా షిల్లాంగ్ ప్రాంతంలోని బ్యాంకులకు సెలవు దినాలు ప్రకటించారు.
డిసెంబర్ 31: ఇయర్ ఎండ్( కొన్ని రాష్ట్రాల్లో స్థానిక సెలవుల కారణంగా బ్యాంకులు మూసివేయబడతాయి)