2025 హయాబుసాని అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది సుజుకీ సంస్థ. వివిధ అప్డేట్స్తో పాటు ఈ బైక్ మూడు కొత్త కలర్ ఆప్షన్స్‌తో అందుబాటులోకి రానుంది. లాంచ్ కంట్రోల్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్లో కూడా మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2025 సుజుకీ హయాబుసా విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..
కొత్త హయాబుసా మూడు కొత్త రంగుల్లో లభిస్తుంది. అవి.. మెటాలిక్ మ్యాట్ గ్రీన్ / మెటాలిక్ మ్యాట్ టైటానియం సిల్వర్, గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, మెటాలిక్ మిస్టిక్ సిల్వర్ / పర్ల్ విగోర్ బ్లూ.
బైక్ ఎఫెక్టివ్నెస్ని పెంచేందుకు లాంచ్ కంట్రోల్ మోడ్స్‌లో స్పీడ్స్ని రివైజ్ చేయడం జరిగింది. అదే విధంగా.. రైడర్ బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్ట్ సిస్టమ్ ఉపయోగించి గేర్లను మార్చినట్లయితే హయాబుసా కొత్త స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ రద్దు అవ్వదు
భారత మార్కెట్లో ఈ సుజుకీ కొత్త హయాబుసా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియదు. దీనిపై సంస్థ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ బైక్‌కి ఇండియాలో క్రేజీ డిమాండ్ ఉండటంతో త్వరలోనే లాంచ్ అవ్వొచ్చని ఊహాగానాలు ఉన్నాయి.