చిత్తూరు జిల్లా, నగిరి నియోజకవర్గంలోని మండలాలలో సోమవారం వాతావరణం పూర్తిగా మారిపోయింది. పలుచోట్ల పొగ మంచు ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. వాతావరణంలో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఉదయం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. మారుతున్న వాతావరణం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ప్రజలు ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలియజేశారు.