శ్రీకాళహస్తి ఆర్‌పీబీఎస్ జెడ్పీ హెస్కూల్‌లో జనవరి 3న జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్(ఎగ్జిబిషన్) నిర్వహిస్తున్నట్లు డీఈవో కేవీఎన్ కుమార్ పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ, ఏపీఎ్‌ససీఈఆర్‌టీ, జిల్లావిద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. 30న పాఠశాల స్థాయిలో, 31న మండల స్థాయిలో పోటీలు నిర్వహించి ఎంపికైన ప్రాజెక్టులను జిల్లాస్థాయి పోటీలకు పంపాలని సూచించారు.
భౌతిక, రసాయన శాస్ర్తాలు, గణితం, ఎర్త్/స్పే్‌ససైన్స్, పర్యావరణం, ఇంజినీరింగ్, బయోసైన్స్/బయోకెమిస్ర్టీ, కంప్యూటర్ సైన్స్‌లకు సంబంధించిన ఉప అంశాలలో ప్రాజెక్టులను ప్రదర్శించేలా ప్రోత్సహించాలని సూచించారు. మండల స్థాయిలో వ్యక్తిగత, గ్రూప్, టీచర్ల వారీగా ప్రాజెక్టులను జిల్లాస్థాయికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. శాస్ర్తీయ దృక్పథం, సామాజిక ప్రయోజనకారిగా ఉన్న ప్రాజెక్టులను రూపొందించాలని పేర్కొన్నారు. థర్మకోల్‌తో తయారు చేసిన ప్రాజెక్టులు అనుమతించబడవని, అటల్ టింకరింగ్ ల్యాబ్ పాఠశాలల నుంచి ఒక్కొక్క ప్రాజెక్టుతో సైన్స్‌ఫేర్‌లో పాల్గొనాలని సూచించారు.