మహిళలు ఉంటే బస్సులను ఆపట్లేదని తమకు ఫిర్యాదులు అందుతున్నాయని ఢిల్లీ సీఎం అతిశీ అన్నారు. మహిళల ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం కట్టుబడిఉందని తెలిపారు. మహిళలు ఇళ్ల నుంచి బయటకువస్తేనే ఆదాయం పెరుగుతుందన్నారు.
అందుకే మహిళలను చూసి బస్సులను ఆపకపోతే డ్రైవర్, కండక్టర్లను సస్పెండ్ చేయాలని ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించారు. బస్సు ఆపకపోతే ఫొటో తీసి సోషల్‌మీడియాలో పోస్టుచేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.