తమిళనాడు రాష్ట్ర BJP వర్గాలు తనను దూరం పెట్టాయని మహిళానేత ఖుష్బూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆమె తమిళ మీడియాతో పంచుకున్నట్టు సమాచారం వెలువడింది.
తనను పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని, సమాచారం కూడా లేదంటూ ఆమె వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ విషయంగా BJPరాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను ప్రశ్నించగా పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానాలు అన్నది తాను ఎవ్వరికీ ఇవ్వనన్నారు.