కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమైంది. కన్నాట్ ప్లేస్, ఇండియాగేట్ తదితర ప్రాంతాల్లో జనం సందడి చేయనున్నారు. వేడుకలు సవ్యంగా సాగేందుకు ఢిల్లీ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
కన్నాట్ ప్లేస్, ఇండియా గేట్‌లకు అనుసంధానమైన రహదారులపై రాత్రి 8గంటల నుండి వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు AI ఆధారిత కెమెరాలతో పహారా కాస్తున్నారు.