తిరుపతి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. పెళ్లకూరు మండలం పెన్నేపల్లిలోని స్టీల్ తయారీ కర్మాగారంలో బుధవారం అర్థరాత్రి భారీగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పలువురి కార్మికులకు గాయాలు కాగా.. మంటల ధాటికి ఫర్మీచర్ఫర్నిచర్ యూనిట్ మొత్తం కాలి బూడిదైంది. ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు పెద్దపెట్టున కేకలు పెడుతూ బయటకు పరుగులు తీశారు. ఫర్నేస్ సమీపంలో పనిచేస్తున్న వారిలో ఐదుగురు చనిపోయి ఉంటారని కార్మికులు చెబుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన నలుగురు కార్మికులను స్థానికులు, పోలీసులు నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.