ఉత్తర భారతావనిని పొగమంచు కమ్మేసింది. దీంతో విమాన, రైళ్ల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ క్రమంలో విమాన సంస్థలకు కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ కీలక సూచనలు చేసింది. ఒక విమానం మూడు గంటలకు మించి ఆలస్యమైన పక్షంలో విమాన సర్వీసును రద్దు చేయాలని సూచించింది. అలాగే రీబోర్డింగ్ ప్రక్రియ సులభతరంగా ఉండేలా చూసుకోవాలని మంచు బారినపడిన విమానాశ్రయాల్లో క్యాట్ 3 సిబ్బందిని సరిపడా నియమించుకోవాలని ఆదేశించింది.మంచు బారిన పడ్డ విమానాశ్రయాల్లో సమర్థంగా సేవలను అందించడం కోసం క్యాట్ 2/క్యాట్ 3 సిబ్బందిని సరిపడా నియమించుకోవాలి. ఇందుకు డీజీసీఏతో విమానాశ్రయాలు సమన్వయం చేసుకోవాలి.విమాన ప్రయాణికులతో కంపెనీలు సర్వీస్ ఆలస్యం, రద్దు అంశాల్లో సమాచారాన్ని సరిగ్గా పంచుకోవాలి.