ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. నూతన సీఎస్ కె.విజయానంద్ కూడా మంత్రివర్గ సమావేశం ముగించుకుని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయానంద్‌కు పవన్‌కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్రాభివృద్ధి, విద్యుత్ సంస్కరణలు వంటి అంశాలపై కాసేపు ముచ్చటించారు. అనంతరం మాజీ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ కూడా డిప్యూటీ సీఎంను కలిశారు.