ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం ప్రకటించారు. ఢిల్లీలో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఫిబ్రవరి 23తో ఢిల్లీ అసెంబ్లీ పదవీకాలం ముగియనుండటంతో ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అందులో 58 జనరల్ స్థానాలు, మరో 12 ఎస్సీ స్థానాలు ఉన్నట్లు సీఈవో వెల్లడించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.దేశంలో ఓట్ల తొలగింపు ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. ఓటర్ లిస్ట్ ట్యాంపరింగ్ ఆరోపణలు సీఈసీ తోసిపుచ్చింది. ఢిల్లీ నుంచి సీఈఓ రాజీవ్ కుమార్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. 'CEOగా నాకు ఇదే చివరి ప్రెస్ కాన్ఫరెన్స్. దేశ వ్యాప్తంగా ఒక ఎలక్షన్ సైకిల్ పూర్తి చేసుకున్నాం. గతేడాది ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాం..ఈ ఏడాది తొలి ఎన్నిక ఢిల్లీలో జరగబోతున్నాయి.. దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటింది' అని తెలిపారు.