సంక్రాంతి పండగ వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఏపీ ప్రజలు.. సంక్రాంతి పండగ సందర్భంగా స్వగ్రామాలకు వచ్చేందుకు ఏకంగా 7,200 అదనపు బస్సులు ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాలకు వీటిని నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. అలాగే 3,900 ప్రత్యేక బస్సులనూ నడపనున్నట్లు తెలిపింది.