మహిళలు తాము ఆర్థికంగా బలోపేతం కావడానికి వీలుగా, తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి వీలుగా మహిళా ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జనశిక్షణా సంస్థాన్ చైర్‌పర్సన్ నాగళ్ల విద్యాఖన్నా తెలిపారు. విజయవాడ మొగల్రాజపురంలోని కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నిరుద్యోగులకు, మహిళలకు, యువతకు ఎంతో మందికి ఉపాధి కార్యక్రమాలలో శిక్షణ ఇచ్చి వారిని పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసినట్లు తెలిపారు. ఈ కోవలో తమ వద్ద శిక్షణ పొందిన మహిళలు తాము తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకోవడానికి మార్కెటింగ్ చేసుకోవడానికి వీలుగా ఫిబ్రవరి 8 నుంచి 16 వరకు మొగల్ ఎగ్జిబిషన్ హాలులో మహిళా ఉత్సవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థాన్ డైరెక్టర్ ఏ.పూర్ణిమ, శిక్షకులు పాల్గొన్నారు.