నగరి నియోజకవర్గంలోని కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి పట్టు వస్త్రాలు పూలమాలలతో విశేషంగా అలంకరించి లోక కళ్యాణార్ధం మహా హోమ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రూపేష్ క్రిష్ణ ఆచార్యులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.