నరసరావుపేట మండలం రావిపాడు శివారులో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపుతప్పి చెట్టుకి ఢీకొని పొలాల్లోకి దూసుకువెళ్లింది.
ఈ ప్రమాదంలో చిలకలూరిపేటకి చెందిన గాదె అంజిరెడ్డి అనే విలేకరి మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. మృతుడు అంజి రెడ్డి పిడుగురాళ్లలో బంధువుని విడిచిపెట్టి చిలకలూరిపేటకి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.