తిరుచానూరులో ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ పథకాన్ని మఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ప్రారంభించారు. అనంతరం తిరుచానూరులో వినియోగదారుడి ఇంట్లో స్టవ్ వెలిగించి టీ పెట్టారు. పైప్‌లైన్ గ్యాస్, సిలిండర్ గ్యాస్ మధ్య తేడా గురించి వినియోగదారుడిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. సీఎం వెంట కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ప్రజాప్రతినిధుల పాల్గొన్నారు. తిరుపతి పర్యటన పూర్తయిన తర్వాత సీఎం.. తన స్వగ్రామమైన నారావారిపల్లెకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా నారావారిపల్లెలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.