పేదవాడికి పక్కా గృహాల పథకానికి పునాది వేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. నందమూరి తారకరామారావు వర్థంతి సందర్భంగా టీడీపీ నేతలు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. విజయవాడ పటమట సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రతి వర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి పేదవాడికి అన్ని సౌకర్యాలు కల్పించి ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు.