ఈ నెల 22, 23 తేదీల్లో కోనసీమ క్రీడోత్సవం నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్ల జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా తెలిపారు. కోనసీమ క్రీడోత్సవం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో గోదావరి భవన్‌లో శనివారం ఆయన సమీక్షించారు. కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ప్రత్యేక చొరవతో ఏ జిల్లాలోను లేనివిధంగా విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపే విధంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. 22న కలెక్టర్ క్రీడా జ్యోతిని వెలిగించి స్థానిక జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఈ పోటీలను ప్రారంభిస్తారన్నారు. 22 మండలాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారన్నారు. ఆయన వెంట జిల్లా స్పోర్ట్స్ డెవలెప్‌మెంట్ అధికారి పీఎస్ సురేష్‌కుమార్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి అడబాల విజయ్‌శ్రీనివాస్, డీఎస్డీవో జీవీఎస్ సుబ్రహ్మణ్యం, వ్యాయామ ఉపాధ్యాయుడు గణేష్, తోట రవి, ప్రసాద్, ఏవీ సత్యనారాయణ, ఉండ్రు ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.