డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మోటారు వెహికల్ ఇనస్పెక్టరు బీవీ ప్రసాద్ సూచించారు. రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా శనివారం పులివెందుల పట్టణంలోని ఆటో డ్రైవర్లు, వాహన డ్రైవింగు లైసెన్సు అభ్యర్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, నిబంధనలు అతిక్రమించరాదని, ప్రయాణికులను సురక్షిత గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. అధిక లోడుతో ప్ర యాణాలు వద్దని డ్రైవర్లకు తెలిపారు. ఇద్దరి కంటే ఎక్కువ మందితో ద్విచక్ర వాహనంపై ప్రయాణించవద్దన్నారు. రహదారి నియమాలు పాటించాలని కోరారు. పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడపడం వల్లనే రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయన్నా రు. డ్రైవింగ్ చేసేటప్పుడు మానసిక, శారీరక ఏకాగ్రత ఎంతో అవసర మన్నారు. ఇతర ఆలోచనలతో, అతి వేగంతో వాహనాలు నడపరాదని సూచించారు. ని బంధనలకు విరుద్దంగా ప్రయాణికులను ఆ టోల్లో ఎక్కిస్తే కేసులు తప్పవన్నారు. అధిక సంఖ్యలో కూలీలను ఒకే వాహనంలో తీసుకెళితే ఆటో డ్రైవరుతో పాటు కూలీల మేస్త్రీపై కూడా కేసులు నమోదు చేయిస్తామన్నారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. మితిమీరిన వేగం ప్రమాదకరమన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలన్నారు. అనుకోకుండా ప్రమాదం జరిగితే హెల్మెట్ ఎంతో ఉపయోగపడుతుందని ఈ సం దర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.