ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన కోట్లాది మంది కస్టమర్లకు బిగ్ బిగ్ అలర్ట్. ఎందుకంటే ఈ బ్యాంకు కస్టమర్లందరి ఖాతాలు ఇప్పుడు రిస్కోలో పడ్డాయి. తమ ఖాతాలకు సంబంధించి ఇ-కేవైసీ (నో యువర్ కస్టమర్) అప్డేట్ చేయాలని బ్యాంక్ హెచ్చరికలు జారీ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాలను అనుసరించి ఇబ్బందులు లేకుండా ట్రాన్సాక్షన్లు జరిగేందుకు కేవైసీ అప్డేట్ తప్పనిసరిగా పేర్కొంది. అందుకు జనవరి 23, 2025 వరకు గడువు ఇచ్చింది. జనవరి 23వ తేదీలోపు కేవీసీ పూర్తి చేయని ఖాతాలు క్లోజ్ కానున్నాయి.
పీఎన్‌బీ కేవైసీ పాలసీ అప్డేషన్ ప్రకారం.. ' కేవైసీ కాలానుగుణ అప్డేట్ కోసం బ్యాంక్ రిస్క్ ఆధారిత విధానాన్ని అవలంబించింది. ఇందులో భాగంగా హైరిస్క్ కస్టమర్లు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా కేవైసీ అప్డేట్ చేయాలి. మీడియం రిస్క్ కస్టమర్లు ప్రతి 8 ఏళ్లకు కనీసం ఒకసారైనా కేవైసీ పూర్తి చేయాలి. తక్కువ రిస్క్ ఉండే కస్టమర్లు పదేళ్లలో ఒకసారైనా కేవైసీ చేయాలి.' అని బ్యాంక్ తెలిపింది. నవంబర్ 30, 2024 వరకు ఎవరైతే కేవైసీ అప్డేట్ చేయలేదో వారందరూ వెంటనే పూర్తి చేయాలని బ్యాంక్ స్పష్టం చేసింది. ఇచ్చిన గడువులోపు కేవైసీ పూర్తి చేయని ఖాతాలపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది.
పీఎన్‌బీ కేవైసీ స్టేటస్ తెలుసుకోవడమెలా?
ముందుగా పీఎన్‌బీ పోర్టల్‌లోకి లాగిన్ కావాలి.
ఆ తర్వాత పర్సనల్ సెట్టింగ్స్ ఆప్షన్‌లో కేవైసీ స్టేటస్ ఎంచుకోవాలి.
కేవైసీ స్టేటస్ పై క్లిక్ చేయగానే స్కీన్‌పై వివరాలు కనిపిస్తాయి.
పీఎన్‌బీ వన్ యాప్ ద్వారా ఇ-కేవైసీ ప్రాసెస్..
బ్యాంక్ కస్టమర్లకు పీఎన్‌బీ వన్ యాప్ ద్వారా ఇ-కేవైసీ పూర్తి చేయవచ్చు.
అందుకు ముందుగా PNB ONE యాప్ లోకి లాగిన్ కావాలి.
కేవైసీ స్టేటస్ తెలుసుకోవాలి.
ఒకవేళ పెండింగ్లో ఉంటే అప్డేట్ కేవైసీపై క్లిక్ చేయాలి.
ఓటీపీ ఆధారిత ఆధార్ అథెంటికేషన్ ద్వారా కేవైసీ పూర్తి చేయాలి.