రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానించిన అమిత్‌షాను పార్లమెంటు బర్తరఫ్ చేయాలని కర్నూలు సీపీఎం కొత్తపల్లి మండల కార్యదర్శి ఎస్.స్వాములు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా నాయకులు పాతకోట భాస్కర్, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులు బొల్లు ప్రసాద్‌బాబు యాదవ్, దళిత నాయకులు గూడెం బాలనాగన్న డిమాండ్ చేశారు. అమిత్‌షా విజయవాడ రాకను నిరసిస్తూ ఆదివారం కొత్తపల్లి మండలంలో గాంధీ విగ్రహం ముందు అమిత్‌షా గో బ్యాక్ అంటూ నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ అంబేడ్కర్ పేరును చెప్పడానికి కూడా సహించలేని స్థితిలో బీజేపీ ప్రభుత్వం ఉందని ఘాటుగా విమర్శించారు. పాతకోట వెంకటరమణ, అంకన్న, ప్రభుదాస్, మోక్షేశ్వరుడు, శ్రీను పాల్గొన్నారు.