గంభీర్ హెడ్‌కోచ్‌గా నియమితుడయ్యాక భారత్ రాణించిన ఫార్మాట్ ఏదైనా ఉందంటే అది టీ20 ఫార్మాటే. వన్డేల్లో ఆడిన మూడు మ్యాచులలోనూ ఓడిపోయింది. టెస్టుల్లోనూ న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో సిరీస్ కోల్పోయింది. ఇక మరో నెల రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. గంభీర్ కోచ్‌గా కొనసాగాలంటే.. ఆ టోర్నీతో పాటు.. ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లో భారత్ సత్తాచాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌పై ఆసక్తి నెలకొంది.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సూర్యకుమార్ నేతృత్వంలోని భారత జట్టు.. ఇంగ్లాండ్ జట్లు అక్కడికి చేరుకుని ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. టీ20 ఛాంపియన్ హోదాలో భారత్.. జట్టు నిండా హిట్టర్లతో ఇంగ్లాండ్ బరిలోకి దిగుతోంది. దీంతో ఈ సిరీస్‌లో భారీ స్కోర్లు నమోదవుతాయనే అంచనాలు ఉన్నాయి.
గతేడాది టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత కెప్టెన్ రోహిత్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీలు ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశారు. దీంతో జట్టు మొత్తం పూర్తిగా కుర్రాళ్లతో నిండిపోయింది. బౌలర్లు ఎవరనేది చూడకుండా బంతి పడటమే ఆలస్యం.. స్టాండ్స్‌లోకి పంపించాలనే లక్ష్యంతో భారత ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. టీ20 ప్రపంచకప్ తర్వాత భారత్ 11 మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఏడు సార్లు 200 పైచిలుకు స్కోరు నమోదు చేయడం గమనార్హం.
టెస్టుల్లోనే బజ్‌బాల్ ఆటతో పరుగుల వరద పారించిన ఇంగ్లాండ్ జట్టు.. టీ20ల్లో అంతకుమించి సత్తాచాటాలని భావిస్తోంది. కేవలం టెస్టులకే కోచ్‌గా ఉన్న మెక్‌కల్లమ్ ఇప్పుడు పరిమిత ఓవర్ల జట్టుకు కూడా కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. దీంతో అతడి నేతృత్వంలో ఆ జట్టు ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, రింకూ సింగ్, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్)
ఇంగ్లాండ్ జట్టు:
జోస్ బట్లర్ (కెప్టెన్), మార్క్ వుడ్, ఫిల్ సాల్ట్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, గస్ అట్కిన్సన్, జామీ ఓవర్‌టన్, బెన్ డకెట్, బ్రైడన్ కార్సే, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, రెహాన్ అహ్మద్.