గుంతకల్లు పట్టణంలో గుత్తి శ్రీశ్రీశ్రీ సునామ జకినీ మాత అమ్మవారి జాతర మహోత్సవ కరపత్రాలను జకినీ మాత అమ్మవారి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించారు.
ఆలయ కమిటీ అధ్యక్షులు ఆలూరు లక్ష్మణరావు మాట్లాడుతూ ఫిబ్రవరి 6 నుంచి అమ్మవారి జయంతి మహోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఎమ్మెల్యేను కోరారు.