ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ లో మూడో రోజు పర్యటిస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో బుధవారం వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే యునీలీవర్, డీపీ వరల్డ్ గ్రూపు, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), గూగుల్ క్లౌడ్, పెప్సీకో, ఆస్ట్రా జెనెకా సంస్థల అధిపతులు, బిల్ గేట్స్, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రతినిధితోనూ సీఎం చంద్రబాబు చర్చలు జరపనున్నారు. తర్వాత దావోస్ సమావేశాల్లో గ్రీన్‌కోతో ఎంవోయూ కుదుర్చుకోనున్నారు. ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబ్రేషన్, గ్రీన్ హైడ్రోజన్ – పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు చంద్రబాబు హాజరవుతారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు వున్న అవకాశాలను వారికి ముఖ్యమంత్రి వివరించనున్నారు.