ఆపత్కాల సమయంలో విద్యుత్తు ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివి. ఔదార్యంలోనే వారే ముందుండేది. బుడమేరు వరదల వేళ అందరికంటే ముందుగా ఒకరోజు వేతనాన్ని ప్రకటించారు’ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశంసించారు. మంగళవారం విజయవాడలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో ఏపీఎ్‌సఈబీ ఇంజనీర్స్ అసోషియేషన్ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. ‘సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన విద్యుత్తు సంస్కరణల కారణంగానే ప్రైవేటు రంగంలో పెట్టుబడులు వస్తున్నాయి. దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు పునరుత్పాదక విద్యుత్తు రంగంలో పెట్టుబడుల సేకరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు పెట్టకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అసెంబ్లీలో ప్రకటించింది. అయినప్పటికీ తన రాజకీయ అస్థిత్వం కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్ అసత్య ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణ సమస్యను పరిష్కరిస్తాం’ అని గొట్టిపాటి హామీ ఇచ్చారు.