తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ఈస్ట్, నార్త్ జోన్ల పరిధిలలో నూతన డీఎస్పీలు బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా శిక్షణ పూర్తి చేసుకున్న బి.విద్య ఈస్ట్‌జోన్ డీఎస్పీగా, వై.శ్రీకాంత్‌ను నార్త్ జోన్ డీఎస్పీ లుగా ప్రభుత్వం నియమించింది.ఈ మేరకు మంగళవారం బాధ్యతలు స్వీకరించి జిల్లా ఎస్పీ డి నరసింహకిశోర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. వారికి ఎస్పీ అభినందనలు తెలిపారు. కోరుకొండలో గుం టూరు జిల్లా తాటికొండకు చెందిన శ్రీకాంత్ డీఎస్పీగా తొలి ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు సహకారశాఖలో సబ్ రిజిస్ట్రార్‌గా రెవెన్యూ డిపార్టుమెంట్‌లో పనిచేశారు. డీఎస్పీగా ఎంపికైన తరువాత కడప జిల్లా జమ్ములమడుగులో ట్రైనింగ్ తీసుకున్నారు. గతంలో కోరుకొండ డీఎస్పీగా పనిచేసిన కె. శ్రీనివాసులు అడిషనల్ డీఎస్పీగా పదోన్నతి పొందడంతో ఆ స్థానంలో కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఇన్‌చార్జ్ డీఎస్పీగా కొనసాగారు.