ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బృందం దావోస్ పర్యటన కొనసాగుతోంది. చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ పలు కంపెనీల అధిపతులతో భేటీ అవుతూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులను కోరుతున్నారు. కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లాతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. స్విస్ నుంచి సాంకేతిక వస్త్రాలు, యంత్రాల తయారీ, హార్డ్ వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు, రైలు విడిభాగాల తయారీ, ఫార్యా స్యుటికల్స్, వైద్య పరికరాల తయారీలో ఆర్ అండ్ డి హబ్ లు, విశ్వవిద్యాలయాల సహకారాన్ని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా లోకేష్ తెలిపారు.ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్ ద్వారా స్థానిక తయారీదారులు యూరోపియన్ మార్కెట్‌కు కనెక్ట్ చేసేలా సహకారం అందించాలని కోరారు. ఇంజనీరింగ్, హెల్త్ సైన్సెస్, రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో పరిశోధనలకు సహకరించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీ కీలకరంగాల్లో స్విస్ కంపెనీల పెట్టుబడులకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని హామీ కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లా హామీ ఇచ్చారు.