ట్రెండింగ్
Epaper    English    தமிழ்

500 సిక్సులు, 10000 పరుగులు… గేల్ సరికొత్త రికార్డు

national |  Suryaa Desk  | Published : Thu, Feb 28, 2019, 06:52 PM

వెస్టిండీస్ చిచ్చర పిడుగు క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాండ్‌తో బుధవారం జరిగిన నాలుగో వన్డేలో గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌ 419 పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్టిండిస్‌ ముందుంచింది. ఈ క్రమంలో బరిలోకి దిగిన క్రిష్ గేల్ చెలరేగి ఆడాడు. ఈ మ్యాచ్‌లో 97 బంతుల్లో 11 ఫోర్లు, 14 సిక్సర్లతో 162 పరుగులు సాధించాడు. వన్డేల్లో క్రిస్ గేల్‌కు ఇది 25వ సెంచరీ. ఈ క్రమంలో క్రిస్ గేల్ వన్డేల్లో వ‌న్డేల్లో ప‌దివేల ప‌రుగుల మైలురాయిని అందుకున్నాడు. వ‌న్డేల్లో ప‌దివేల ప‌రుగుల మైలురాయిని దాటిన 14వ బ్యాట్స్‌మెన్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. కాగా, వెస్టిండీస్‌ తరఫున ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గా గేల్‌ గుర్తింపు పొందాడు. అంతకముందు విండిస్ తరుపున వ‌న్డేల్లో ప‌ది వేల ప‌రుగుల మైలురాయిని బ్రియాన్ లారా అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ మొత్తం 14 సిక్సులు కొట్టాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదు వందలు సిక్సర్‌ కొట్టిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ సిరీస్‌ తొలి మ్యాచ్‌లో షాహిద్‌ ఆఫ్రిది (476 సిక్సర్లు) పేరుపై ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును క్రిస్ గేల్ వెనక్కి నెట్టేశాడు. ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్ అద్భుతంగా ఆడినప్పటికీ వెస్టిండీస్ విజయం సాధించలేకపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa