ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవునికడపలో కల్యాణమండపం, చౌల్ట్రీని ప్రారంభించిన టిటిడి ఛైర్మన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 28, 2019, 08:00 PM

కడప నగరంలోని దేవునికడపలో టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి వారి ఆలయం వద్ద టిటిడి కల్యాణమండపం, యాత్రికుల వసతి సముదాయాన్ని(చౌల్ట్రీ) గురువారం టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
కాగా, రూ.4.5 కోట్లతో 4,066 చ.అడుగుల విస్తీర్ణంలో టిటిడి కల్యాణమండపాన్ని, 4,044 చ.అడుగుల విస్తీర్ణంలో చౌల్ట్రీని నిర్మించింది. చౌల్ట్రీలో మూడు ఫ్లోర్లలో 21 గదులు, 2 డార్మిటరీ హాళ్లు ఉన్నాయి.
అనంతరం కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం సిద్ధయ్యగారి మఠంలో రూ.4.20 కోట్లతో రాజగోపురం, ధ్వజస్తంభం, బలిపీఠం, ప్రాకారం, నవగ్రహ మండపం, 2 ఆర్చిల నిర్మాణానికి జరిగిన భూమిపూజ కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa