ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారిశుధ్యం అధ్వానంతో విపరీతమైన దోమలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 25, 2025, 03:24 PM

ప్రకాశం జిల్లాలోని పట్టణాల్లో పారిశుధ్యం అధ్వానంతో అందరికీ నిద్రలేకుండా చేస్తున్నాయి. అలాగే వ్యాధుల భయం వెంటాడుతోంది. దోమకాటు నుంచి తప్పించుకొనేందుకు ప్రజలు లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఒంగోలు నగరంలో లక్షకుపైగా గృహాల్లో 3లక్షలపైనే జనాభా ఉన్నారు. ఇకపోతే ఫుట్‌పాత్‌లపై జీవించేవారు, ఇతర ప్రాంతాల నుంచి రోజువారీ పనుల కోసం నగరానికి వచ్చేవారు వేలల్లోనే ఉంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా వారి రోజువారీ ఖర్చులతోపాటు కచ్చితంగా దోమల నియంత్ర ణకు రోజుకు సగటున రూ.20 నుంచి రూ.30 వరకూ ఖర్చు చేస్తున్నారు. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, చీమకుర్తి పట్టణాల్లో 1.43లక్షల మంది వరకు నివసి స్తున్నారు. ఇటీవల పగలు, రేయి తేడా లేకుండా దోమలు దాడి చేస్తున్నాయి. వాటి నియంత్రణ టార్టాయిస్‌, జెట్‌, స్లీప్‌వెల్‌, గుడ్‌నైట్‌, మస్కిటో బ్యాట్‌లు ఇలా రకరకాలు ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. దీంతో ఒక్కో ఇంటికి తెలియకుండానే నెలకు రూ.500 నుంచి రూ.800ల వరకు ఖర్చు చేస్తున్నారనడంలో సందేహం లేదు. ప్రజారోగ్యం మెరుగు కోసం మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు లక్షలు ఖర్చుచేస్తున్నామని చెబుతున్నా నగరవాసులకు ఎటువంటి ప్రయోజనం కలగడం లేదు.పట్టణాల్లో ప్రతిరోజూ పారిశుధ్య పనులు నిర్వహించడంతోపాటు వ్యాధులు అఽధికంగా వ్యాప్తి చెందే ప్రాంతాలను గుర్తించిపరిశుభ్రతపై జనానికి అవగాహన కల్పించాలి. కాలువల్లో మురుగు తొలగించాలి. తడి చెత్త నిల్వ లేకుండా చూడాలి. ఖాళీ ప్రదేశాలలో, కాలువల్లో మురుగునీటిపై ఉండే దోమలను లార్వా దశలోనే అంతం చేసేందుకు తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో గంభూషియా చేపలను వదలాలి. దోమలను నియంత్రించేందుకు అబెట్‌, పైరిత్రిమ్‌, మలాథియన్‌తో స్ర్పే, మలాథియన్‌ ద్రావణంతో ఫాగింగ్‌ చేయాలి. వాటితోపాటు ప్రతి వీధిలోనూ చెత్తను తొలగించిన అనంతరం బ్లీచింగ్‌ చల్లి పరిశుభ్రమైన వాతావరణం కనిపించేలా చూడాలి. కానీ ఇలాంటి పరిస్థితి జిల్లాలోని ఏ పట్టణంలోనూ కనిపించడం లేదు. మురుగునీటి కుంటలలో గంభూషియా చేపలు, ఆయిల్‌ బాల్స్‌ వదలడం, డీడీటీ స్ర్పేయింగ్‌ చేయడం మచ్చుకైనా కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa