ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెల్లూరు, తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో ......అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2019, 12:15 AM

సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. అభ్యర్థుల ఎంపికను రాయలసీమ నుంచే ఆయన మొదలు పెట్టారు. అందులోభాగంగా నెల్లూరు, తిరుపతి టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. నెల్లూరు, తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. తిరుపతి- సుగుణమ్మ, శ్రీకాళహస్తి- బొజ్జుల సుధీర్‌ రెడ్డి, ఎస్‌సీవీ నాయుడు, సత్యవేడు- తలారి ఆదిత్య, జేడీ రాజశేఖర్, సూళ్లూరుపేట- పరసా రత్నం, గూడూరు-పాశం సునీల్, వెంకటగిరి-రామకృష్ణ, స‌ర్వేపల్లి-సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నెల్లూరు సిటీ- నారాయణ, నెల్లూరు రూరల్- ఆదాల ప్రభాకర్, కొవ్వూరు-శ్రీనివాసరెడ్డి, ఉదయగిరి- బొల్లినేని రామారావు, మద్దినేని అశోక్ బాబు, ఆత్మకూరు- బొల్లినేని కృష్ణయ్య, పెళ్లకూరు- శ్రీనివాస రెడ్డి, కావలి- బీదా మస్తాన్ రావు, కందుకూరు- పోతుల రామారావు పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారు.


 


 చంద్రబాబు ఇప్పటిదాకా ఏడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో సమీక్షలు పూర్తి చేశారు. ఇందులో కృష్ణా జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం లోక్‌సభ సీట్ల పరిధిలో పది మంది అసెంబ్లీ అభ్యర్థులకు పచ్చజెండా ఊపారు. వీరిలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు (మైలవరం), కొల్లు రవీంద్ర (బందరు), శ్రీరాం తాతయ్య (జగ్గయ్యపేట), తంగిరాల సౌమ్య (నందిగామ). బొండా ఉమామహేశ్వరరావు (విజయవాడ సెంట్రల్‌), గద్దె రామ్మోహన్‌రావు (విజయవాడ తూర్పు), వల్లభనేని వంశీ (గన్నవరం), బోడె ప్రసాద్‌ (పెనమలూరు), డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ (అవనిగడ్డ) ఉన్నారు. విజయవాడ పశ్చిమ నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ ఈసారి పోటీ చేయడం లేదు. ఆయన బదులు ఆయన కుమార్తె షబానా ఖాతూన్‌ పోటీ చేయనున్నారు. కడప లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో నలుగురు అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. పి.రామసుబ్బారెడ్డి (జమ్మలమడుగు), సతీశ్‌రెడ్డి (పులివెందుల), పుట్టా సుధాకర్‌ యాదవ్‌ (మైదుకూరు), పుత్తా నరసింహారెడ్డి (కమలాపురం) ఖరారయ్యారు. రాజంపేట లోక్‌సభ పరిధిలో చెంగల్రాయుడు (రాజంపేట), నరసింహ ప్రసాద్‌ (రైల్వేకోడూరు), రమేశ్‌కుమార్‌రెడ్డి (రాయచోటి), నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి (పీలేరు), అనీషారెడ్డి (పుంగనూరు)లకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. కర్నూలు, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కేఈ శ్యాంబాబు (పత్తికొండ), కేఈ ప్రతాప్‌ (డోన్‌), బీవీ జయనాగేశ్వరరెడ్డి (ఎమ్మిగనూరు), తిక్కారెడ్డి (మంత్రాలయం), భూమా అఖిలప్రియ (ఆళ్లగడ్డ), బుడ్డా రాజశేఖరరెడ్డి (శ్రీశైలం), బీసీ జనార్దనరెడ్డి (బనగానపల్లె)లకు అసెంబ్లీ అభ్యర్థులు ఖరారయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa