మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసే వారికి వివిధ మ్యూచువల్ ఫండ్స్.. 7 కొత్త స్కీమ్స్ తీసుకురాగా.. ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఎస్బీఐ, యాక్సిస్, ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ నుంచి స్కీమ్స్ ఉన్నాయి. వీటి పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. పెట్టుబడులు చేసేందుకు ఎన్ని ఆప్షన్లు ఉన్నా.. చాలా మంది మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇక్కడ రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ కోసం ప్రయత్నిస్తుంటారు. స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా ఇది మంచి ఆప్షన్. కాంపౌండింగ్ ఎఫెక్ట్ కారణంగా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో రిటర్న్స్ అందుకునేందుకు అవకాశం ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్దీ మంచి లాభాలు అందుకోవచ్చని నిపుణులు చెబుతుంటారు. పాస్ట్ రిటర్న్స్ చూస్తే కూడా చాలా వరకు పథకాలు అద్భుత స్థాయిలో రిటర్న్స్ అందించాయి. వీటిల్లో చాలా రకాల కేటగిరీల పథకాలు ఉంటాయి. ఇప్పుడు రెండు ఇండెక్స్ ఫండ్స్, ఒక సెక్టోరియల్ ఫండ్, షార్ట్ డ్యురేషన్ ఫండ్, థిమాటిక్ ఫండ్, మల్టీ అసెట్ అలొకేషన్ అండ్ ఈటీఎఫ్ ఫండ్స్ సబ్‌స్క్రిప్షన్ కోసం వచ్చేశాయి. వీటి గురించి తెలుసుకుందాం.
ఎస్బీఐ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కాగా.. ఈ నెల 31 లాస్ట్ డేట్. ఇందులో కనీసం రూ. 5000 తో పెట్టుబడి పెట్టాలి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఈ పథకం పనితీరుకు కొలమానంగా ఉంది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్‌లోని షేర్లపై ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది. దీర్ఘకాలం కొనసాగిస్తే మంచి లాభాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొంత రిస్క్ ఉంటుంది. ఫండ్ మేనేజర్ హర్స్ సేథీ.
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ నుంచి యాక్సిస్ నిఫ్టీ 500 మూమెంటమ్ 50 ఇండెక్స్ ఫండ్ ఉంది. ఇక్కడ వచ్చే నెల 7 వరకు ఛాన్స్ ఉంది. కనీసం రూ. 100 ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. నిఫ్టీ 500 మూమెంటమ్ 50 TRI ఈ పథకం పనితీరుకు కొలమానంగా ఉంది.
బరోడా బీఎన్‌పీ పారిబస్ ఎనర్జీ అపార్చునిటీస్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ ఆఖరి తేదీ ఫిబ్రవరి 4. ఇది సెక్టోరియల్ లేదా థిమాటిక్ విభాగం ఫండ్. ప్రధానంగా ఇంధన రంగ కంపెనీలపై ఇన్వెస్ట్ చేస్తుంది. కనీసం రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే చాలు. గ్రో నిఫ్టీ ఇండియా రైల్వేస్ PSU ఇండెక్స్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ జనవరి 30 వరకు కొనసాగనుంది.
యూనియన్ షార్ట్ డ్యురేషన్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కాగా.. ఇక్కడ జనవరి 28 వరకు గడువు ఉంది. ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ ఫిబ్రవరి 7 వరకు కొనసాగుతుంది. గ్రో నిఫ్టీ ఇండియా రైల్వేస్ PSU ETF సబ్‌స్క్రిప్షన్ ఓపెన్ కాగా.. ఇది జనవరి 30 వరకు కొనసాగుతుంది. ఇక్కడ కూడా నిపుణుల సలహాతో ఇన్వెస్ట్ చేయడం మంచిది. రిస్క్ లేకుండా రిటర్న్స్ అందుకునే ఛాన్స్ ఉంటుంది.