మదనపల్లెలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేసి, జెండా వందనం చేశారు. జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా ఎస్.రెడ్డీ సాహెబ్ మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, యావత్ ప్రపంచానికి ప్రజాస్వామ్య విలువలను అందించడంలో మన దేశం అగ్రగామిగా నిలిచిందని అన్నారు.