ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాడెన్ కుమారుడి ఆచూకి చెబితే భారీ నజరానా

international |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2019, 11:47 AM

వాషింగ్టన్ : ఆల్ ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్ జా బిన్ లాడెన్ ఆచూకీ తెలిపిన వారికి అమెరికా ఒక మిలియన్ డాలర్లు (రూ.7 కోట్లు) రివార్డు ప్రకటించింది. హమ్ జా బిన్ లాడెన్ పాకిస్తాన్, అప్ఘనిస్తాన్, సిరియా దేశాల్లో ఉన్నాడని కొన్నాళ్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. మరోవైపు అతడు ఇరాన్ లో హౌజ్ అరెస్ట్ అయినట్లుగా కథనాలు వచ్చాయి. హమ్ జా ఏ దేశంలో ఉన్నట్లు తెలిసినా..అతడు ఉన్న ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేసినా వారికి రివార్డు అందజేస్తామని అమెరికా ప్రకటించింది.


2011 మే నెలలో తన తండ్రి ఒసామా బిన్ లాడెన్ ను చంపిన అమెరికా, దాని మిత్ర దేశాలపై ప్రతీకారం తీర్చుకుంటామని హమ్ జా బిన్ లాడెన్ గతంలో హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. పాలస్తీనియన్ల స్వేచ్చాస్వాతంత్రం సిరియా ఉగ్రవాదులు ఐకమత్యంగా ఉండి పోరాడాలని 2015లో ఒసామా బిన్ లాడెన్ ప్రసంగంతో కూడిన ఆడియో టేపులు కూడా విడుదలయ్యాయి. 


ఆ తర్వాత అమెరికాలోని ట్విన్ టవర్స్ పై దాడి సమయంలో..ఓ విమానాన్ని హైజాక్ చేసిన వ్యక్తి కూతురినే హమ్ జా బిన్ లాడెన్ పెళ్లి చేసుకున్నట్లు అతని కుటుంబం వెల్లడించింది. ప్రస్తుతం అల్ ఖైదాలో హమ్ జా కీలక స్థానంలో ఉన్నాడని, తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నట్లు లాడెన్ సోదరులు గతంలో వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa