ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు గుంటూరు జిల్లా జైలుకి వెళ్లనున్న డిప్యూటీ స్పీకర్, కారణమిదే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 26, 2025, 07:54 PM

 కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు జిల్లా జైల్లో నిందితుడిని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్  రఘురామకృష్ణంరాజు  గుర్తించనున్నారు. దీని కోసం జిల్లా న్యాయమూర్తి సమక్షంలో పోలీసులు ఆదివారం పరేడ్ నిర్వహించనున్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని రిమాండ్‌లో ఉన్న తులసి బాబు కోర్టును ఆశ్రయించారు. దీంతో తులసిబాబు పోలికలతో ఉన్న వ్యక్తులతో రఘురామకు పరేడ్ నిర్వహించనున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే మాజీ సీఐడీ ఏఎస్సీ విజయ్‌పాల్ అరస్టయి గుంటూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com