ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీస్‌ వాహనాన్ని ఢీకొన్న లారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2019, 12:40 PM

భువనేశ్వర్‌ : ఒడిశాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఒడిశా స్పెషల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ (ఒఎస్‌ఎపి) కానిస్టేబుళ్లు మృతి చెందారు. మరొక 17 మంది పౌరులు గాయపడ్డారు. బేల్పహార్‌ వద్ద జాతీయ రహదారి 49పై వేగంగా వస్తున్న లారీ పోలీస్‌ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి చెందారు. మరొక 17 మంది ఇతరులు గాయపడ్డారు. బన్‌హర్పల్లిలో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పాల్గొననున్న ఒడిశా పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌లో కార్యక్రమానికి ఒఎస్‌ఎపి టీమ్‌ వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa