ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోడీ కపట ప్రేమకు నామమాత్ర రైల్వేజోన్ తార్కాణం : ర‌ఘువీరా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2019, 02:53 PM

విశాఖ రైల్వే జోన్ నామమాత్రంగా ప్రకటించి ఆంద్ర ప్రజలపై ప్రధాని మోడీ కపట ప్రేమ చూపిస్తున్నారని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. విశాఖపట్నంకు మోడీ రావడంతో ఈ రోజు ప్రత్యేక హోదా భరోసా యాత్రను ప్రభుత్వం నిరాకరించింది. దీంతో కాంగ్రెస్ నాయకులు నల్ల రిబ్బన్ లలో నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో రఘువీరా రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, గిడుగు రుద్రరాజులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా రఘువీరా రెడ్డి మాట్లాడుతూ… 300 మందికిపైగా పాకిస్థాన్ టెర్రరిస్ట్లను భారత సైనికులు మట్టుపెట్టడం అభినందనీయం. దానిని యడ్యూరప్ప రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్ నామమాత్రంగా ప్రకటించి ఆంద్ర ప్రజలపై మోడీ కపట ప్రేమ చూపిస్తున్నారు. మోడీ ఒక ద్రోహి. విశాఖపట్నంకు మోడీ రావడంతో ఈ రోజంతా నల్ల రిబ్బన్ లలో నిరసన తెలుపుతున్నామన్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పొత్తు ఉండదు. మా పొత్తు ప్రజలతోనే అని రఘువీరా రెడ్డి తెలిపారు. ఈ నెల 10వ తేదీన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటన చేస్తాం. చిరంజీవి ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారు, సినిమా షూటింగ్ ఉన్నందున ఆయన బిజీగా ఉన్నారన్నారు. నేటికి 11రోజుల పాటు ప్రత్యేక హోదా భరోసా యాత్ర సాగింది. 3వ తేదీన  శ్రీకాకుళంలో ముగింపు యాత్రలో ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి హాజరుకానున్నారని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa