అసెంబ్లీ ఎన్నికల వేళ దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీకి ఊరట లభించింది. ఆమెకు వ్యతిరేకంగా భాజపా దాఖలు చేసిన పరువునష్టం పిటిషన్‌ను నగరంలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది.ఆమె మొత్తం పార్టీని ఉద్దేశించి మాట్లాడారని.. ఒక్క వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యానించలేదని న్యాయస్థానం పేర్కొంది. దీంతో ఆమెకు ఈ కేసులో ఉపశమనం లభించింది.గతేడాది లోక్‌సభ ఎన్నికల ముందు మంత్రిగా వ్యవహరించిన ఆతిశీ భాజపాపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ పార్టీలో చేరకపోతే.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆప్ నేతలను అరెస్టు చేస్తుందని కాషాయ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు బెదిరించారని ఆమె ఆరోపించారు. దీంతో ఆతిశీకి వ్యతిరేకంగా భాజపా నేత ప్రవీణ్ శంకర్ కపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.దీంతో పాటు ఆమెపై న్యాయస్థానంలో పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. ఆతిశీ భాజపాను ఉద్దేశించి వ్యాఖ్యానించారని.. ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడలేదని పిటిషన్‌ను కొట్టివేసింది. ఇదిలా ఉండగా.. దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 5న పోలింగ్.. 8న ఫలితాలు వెలువడనున్నాయి. కల్కాజీ స్థానం నుంచి సీఎం ఆతిశీ మరోసారి ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa