ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోసమే వృత్తిగా చంద్రబాబు బ్రతుకుతున్నాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 08:16 AM

తాను పొడిచే వెన్నుపోటు దెబ్బ ఎలా ఉంటుందో ఏపీ ప్రజలకు చంద్రబాబు మరోసారి రుచి చూపించారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. అయన మీడియాతో మాట్లాడుతూ.... ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపించి సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయబోవడం లేదని ప్రకటించి ప్రజలను తీవ్రంగా వంచించడమే కాకుండా, వృద్ధి రేటు 15 శాతానికి పెరిగితే సంక్షేమ పథకాలు అమలు చేస్తానని మరో దిక్కుమాలిన అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు. ప్రపంచంలో ఎందరో మోసగాళ్లను చూసుంటాం కానీ, మోసమే వృత్తిగా పెట్టుకున్న చంద్రబాబు లాంటి వ్యక్తిని ఎవరూ చూసుండరు.


ఏడు నెలలు గడిచినా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకపోగా రాష్ట్రాన్ని పీకల్లోతు అప్పుల్లో ముంచేశారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు పాలన సాగుతోంది. ఆయన ఈ ఏడు నెలల పాలనంతా వంచన, మోసం, దోపిడీతోనే సాగింది. తాను సంపద సృష్టిస్తానని ఎన్నికల్లో చంద్రబాబు చెబితే, అది లోకేష్‌ కోసమని జనం గుర్తించలేకపోయారు. బాబు మాటలను గుడ్డిగా నమ్మి మోసపోయారు. అందుకే ఇప్పుడు ప్రజల్లో చంద్రబాబు మీద తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ చరిత్రలో ఇంత తక్కువ కాలంలో వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రభుత్వం లేదు.  ఈ ప్రభుత్వానికి ప్రజల ముందుకు వెళ్లే ధైర్యముందా? చంద్రబాబు చెప్పిన తల్లికి వందనం పథకాన్ని తల్లికి తద్దినంగా మార్చేశాడు. అన్నదాత సుఖీభవను అన్నదాత అప్పోభవగా మార్చాడు.


ఆడబిడ్డకు నిధి పథకాన్ని ఆడబిడ్డకు ఏడుపు విధిగా మార్చాడు. ఆఖరుకి అధికారంలోకి వచ్చాక 5 లక్షల మందికి పింఛన్లు కట్‌ చేశారు. కూటమి ప్రభుత్వం చేసిన మోసాలకు పవనానంద స్వామి ఏ గుడి మెట్లు కడుగుతాడో చెప్పాలి. వైయ‌స్ జగన్‌గారి హయాంలో కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు ఆపకుండా అందిస్తే చంద్రబాబు మాత్రం అమలు చేయడం చేతకాక మీనమేషాలు లెక్కిస్తున్నాడు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా కరెంట్‌ చార్జీల రూపంలో ప్రజలపై రూ.19 వేల కోట్ల భారం మోపాడు అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com