దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. ప్రధాన షేర్లలో కొనుగోళ్లకు మదుపర్లు ఆసక్తి చూపడంతో సూచీలు రాణిస్తున్నాయి. సెన్సెక్స్ 274 పాయింట్ల లాభంతో 76,068 వద్ద.. నిఫ్టీ 58 పాయింట్లు పెరిగి 23,015 వద్ద కొనసాగుతోన్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్అండ్టీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.