దావోస్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయ్యిందని, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తో కలిసి వెళ్లిన ఈ పర్యటన చాలా సంతృప్తిని ఇచ్చిందని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన కర్నూలులో మాట్లాడుతూ... ఇండియాలో పెట్టుబడులు పెట్టాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుర్తుకు వచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌లో పారిశ్రామిక వేత్తలకు వివరించారని అన్నారు. ఈ క్రమంలో పారిశ్రామిక, వ్యాపార వేత్తలు ఏపికి రావడానికి ఆసక్తితో ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. చాలా తక్కువ వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ రూపు రేఖలు మారనున్నాయని, భారీ పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ఆరు నెలల లోపే ఈ అభివృద్ధి ఫలితాలు ప్రజలకు కనిపిస్తాయన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనతో పారిశ్రామిక, వ్యాపార వేత్తలు భయపడి పారి పోయారని.. అలాంటి వారంతా ఇప్పుడు ఏపీకి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు పెట్టుబడులు తెచ్చామని అన్నారు... అయితే ఏ ఒక్కటి ఆచరణలో పెట్టలేదని మంత్రి టీజీ భరత్ విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa