హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ యమునా నది నీటిని తాగారు. యమునా జలాలను హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విషపూరితం చేస్తోందని అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ చర్యకు ఉపక్రమించారు. ఈరోజు హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లోని పల్లా గ్రామంలో యమునా నది వద్ద ఆయన నదీ ప్రవాహంలోని నీటిని దోసిలిలోకి తీసుకుని తాగారు. ఆ తర్వాత ఆ నీటిని తన తలపై కూడా చల్లుకున్నారు. అనంతరం హర్యానా సీఎం మాట్లాడుతూ, ఎలాంటి సందేహాలు లేకుండా తాను ఈ నీటిని తాగానన్నారు. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిశీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అబద్ధాలు ప్రజల్లో పనిచేయడం లేదన్నారు.