అందరూ పల్లకి ఎక్కితే మోసే బోయీలెవరు? అందరూ సాఫ్ట్‌వేర్, వైట్‌కాలర్ ఉద్యోగాలు చేస్తే దేశానికి ఇంత తిండిపెట్టేదెవరు? అందుకే దేశానికి రైతే వెన్నెముక అంటారు. పొలంలో అతని చెమట చిందకపోతే ఈ జగతి ఆకలితో అలాడిపోతుంది. అయితే కరువు, అప్పులు, గిట్టుబాటు ధరల్లేకపోవడం వల్ల చాలామంది ఎందుకొచ్చిన వ్యవసాయం అని ఈసురోమంటున్నారు. ఇలాంటి క్లిష్టపరిస్థితిలో సైతం కొందరు సృజనాత్మకత రంగరించి సాగులో దూసుకెళ్తున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన కీరైకడై సంస్థ అలాంటిదే. సేంద్రియ పంటలు, ఇతర నాణ్యమైన వ్యవసాయోత్పత్తులు అందిస్తున్న ఈ సంస్థ.. తగినంతమంది రైతులు లేక ఇబ్బంది పడుతోంది. అందుకే ‘రైతులు కావలెను.. ’ అని ప్రకటన ఇచ్చింది. నెలకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేల జీతం ఇస్తామని, ఉచిత భోజనవసతి కల్పిస్తామని తెలిపింది. సమాజానికి సహజసిద్ధ ఆహారాన్ని అందించే రైతులు కోసం ఎదురుచూస్తున్నామని, ప్రకృతి వ్యవసాయంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa