అంగనవాడీ కేంద్రాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర స్త్రీ, శిశు, ప్రత్యేక ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి సూర్యకుమారి సూచించారు. పీలేరు పట్టణం యల్లమంద క్రాసులోని అంగనవాడీ కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేసి కేంద్రంలోని చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. ఈసందర్భంగా చిన్నారులకు అందుతున్న ఆహారం, నేర్పుతున్న పాఠాలు, ఆటలు, పద్యాల గురించి వాకబు చేశారు. అంగనవాడీకి సరఫరా అవుతున్న నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించారు. కేంద్రంలో వంటలు వాడే విధానాన్ని కార్యకర్త ఇందిర, సహా యకురాలిని అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత ప్రమాణాల కన్నా తక్కువ బరువున్న పిల్లలను పరీక్షించి వారి ఎదుగుదలకు చేపడుతున్న ప్రత్యేక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభు త్వం అందించే పౌష్టికాహారాన్ని చిన్నారులకు అం దించాలని, ప్రతి నెలా వారి ఎదుగుదలను నమో దు చేయడంతోపాటు క్రమం తప్పకుండా అంగన వాడీ కేంద్రాలకు తనిఖీ చేయాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ రమాదేవి, డీఎల్డీవో లక్ష్మీపతి, ఎంపీడీవో శివశంకర్, సీడీపీవో రాజమ్మ, సూపర్ వైజర్లు స్వరూప, అక్కాయమ్మ పాల్గొన్నారు.కాగా కలకడ మండలం బాటవారిపల్లె అంగన వాడీ కేంద్రాన్ని రాష్ట్ర శిశుసంక్షేమశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సూర్యకుమారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటలను పరిశీలించి మెనూ ప్రకా రం విద్యార్థులకు నాణ్యమైన వంటకాలను వడ్డిస్తు న్నారా అని ఆరాతీశారు. అనంతరం తరగతి గదికి వెళ్లి పాఠ్యాంశాలు, బోధన తీరుపై చర్చించారు. పిల్లల ఆటలపట్ల ఆసక్తి చూపుతున్నారా..వారికి కావాల్సిన కీడ్రా వస్తువులను అందుబాటులో ఉన్నాయా అంటూ ఆరాతీశారు. చిన్నారుల ఆరో గ్యం పట్ల అశ్రద్ధ వహించడకుండా నిర్ణీత సమ యానికి వైద్య పరీక్షలు చేయించాలని సూచించా రు. క్రమం తప్పకుండా పేరంట్స్ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. కేంద్రంలో మౌలిక వసతులపై సమీక్షించారు. అంగనవాడీ కార్యకర్తల తో మాట్లాడుతూ శాఖపరంగా సమస్యలను అడి గి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లాఅధికారి లక్ష్మీపతి, మస్తానవలి, రమాదేవి, రాజమ్మ, అబ్దు ల్రహీం, మునీంద్రనాయక్, శాంత, యశోధ రాణి, కార్యదర్శి నాగభూషణం పాల్గొన్నారు.