తెనాలి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం మంత్రి నాదెండ్ల మనోహర్ ను పలువురు ప్రజలు కలిసి తమ సమస్యలు తెలిపారు. వివిధ సమస్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ కు అర్జీలు అందజేశారు. ఆయా సమస్యలు పరిష్కరించాలని మంత్రిని కోరారు. సమస్యలు మంత్రి మనోహర్ కు విన్నవించుకునేందుకు వస్తున్న ప్రజలతో క్యాంపు కార్యాలయం కిటకిటలాడింది.