రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ఫిబ్రవరి 5న తలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తన కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు.
విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆయన విమర్శించారు. దీన్ని వైసీపీ ఏ మాత్రం సహించబోదని తెలిపారు. పిల్లలకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ పోరాడుతుందని కేతిరెడ్డి స్పష్టం చేశారు.