మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో క్యాన్సర్ బాధితురాలు వెంకటలక్ష్మికి సీఎం సహాయనిధి రూ. 7లక్షలు మంజూరైంది. సంబంధిత చెక్కును జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు సంధి రెడ్డి శ్రీనివాసులు శుక్రవారం అందజేశారు.
ఆయన మాట్లాడుతూ. చెన్నంపల్లి గ్రామానికి చెందిన వెంకట్ లక్ష్మి కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోందన్నారు. ఆమె హైదరాబాదులోని బసవతారకం హాస్పిటల్లో చికిత్స పొందేలా మంత్రి చర్యలు తీసుకున్నట్లు వివరించారు.