ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాడెన్‌ కుమారుని ఆచూకీపై అమెరికా భారీ రివార్డు

international |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2019, 10:05 PM

అల్‌ఖైదా మాజీ నేత ఒసామా బిన్‌లాడెన్‌ కుమారుడు హమ్జా బిన్‌ లాడెన్‌ ఆచూకీ అందిస్తే ఒక మిలియన్‌ డాలర్లను బహుమతిగా ఇస్తామని అమెరికా ప్రకటించింది. హమ్జా పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌‌, ఇరాన్‌, సిరియాలో ఉండవచ్చని అమెరికా అనుమానం వ్యక్తంచేస్తోంది. లాడెన్‌ను మట్టుబెట్టిన అనంతరం అల్‌ఖైదాకు హమ్జా నాయకుడయ్యాడని అమెరికా తెలిపింది. అయితే తన తండ్రిని చంపినందుకు ప్రతీకారంగా అమెరికాపై దాడి చేసే అవకాశం ఉందని ఆ దేశం భావిస్తోంది. ఈ క్రమంలోనే అతడి సమాచారం అందిస్తే మిలియన్‌ డాలర్లను బహుమతిగా ప్రకటించింది.
హమ్జా బిన్‌ లాడెన్‌ను అల్‌ఖైదా వర్గాలు జిహాద్‌కు రాజకుమారుడిగా అభివర్ణిస్తున్నాయి. 2015లో హమ్జా సిరియా అంతర్‌ యుద్ధం పాలస్తీనా స్వేచ్ఛకు దారి తీస్తుందని జిహాదీలు ఐక్యంగా ఉండాలని ఓ ఆడియో సందేశం విడుదల చేశాడు. ఆ తర్వాత సౌదీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మరో సందేశంలో జిహాదీలను కోరాడు. కాగా.. హమ్జా ఎక్కడ ఆశ్రయం పొందుతున్నాడన్న సమాచారం లేదు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa