ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఫుడ్స్, డ్రింక్స్ తీసుకుంటే పేరుకుపోయిన టాక్సిన్స్ దూరం

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2025, 11:50 PM

బాడీ డీటాక్స్ చేయడమనేది ఆరోగ్య సమస్యల్ని దూరం చేసుకోవడానికి చాలా ముఖ్యం. డీటాక్స్ అంటే బాడీలోని టాక్సిన్స్‌ని బయటికి పంపించి లోపల నుంచి బాడీని సరిచేయడం. దీనికోసం మంచి ఫుడ్ తీసుకోవడం, నీరు తాగడం, ఫాస్టింగ్ చేయడం, ఆకుపచ్చ కూరగాయలు తీసుకోవడం, గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటివి తీసుకోవడం చేయొచ్చు. దీని వల్ల ప్రమాదకరమైన టాక్సిన్స్ దూరమవ్వడమే కాకుండా జీర్ణక్రియ మెరుగ్గా మారి శక్తి పెరుగుతుంది.


డీటాక్స్ అనేది బాడీని క్లీన్ చేసుకోవడం,బాడీకి రెస్ట్ ఇవ్వడం వంటివి జరుగుతాయి. మనం శరీరాన్ని బయటి నుండి మాత్రమే కాకుండా లోపల నుండి కూడా కచ్చితంగా డీటాక్స్ చేయాలి.


డీటాక్స్ చేయడం వల్ల వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. మలినాలు తొలగిపోతాయి.


ఎక్కువగా నీరసంగా ఉండి, కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఉన్నప్పటికీ బాడీని డీటాక్స్ చేయాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోండి. దీనికోసం సహజంగా బాడీని ఎలా డీటాక్స్ చేయాలో తెలుసుకోండి.


శుద్ధమైన భోజనం


శరీరానికి పోషకాహారం చాలా ముఖ్యం. పోషకాహారం తీసుకుంటే బాడీ ఆటోమేటిక్‌గా డీటాక్స్ అయిపోతుంది. దీనికోసం సేంద్రీయ, సహజ పద్ధతుల్లో పండిన ఫుడ్ తీసుకోవాలి. టాక్సిన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవద్దు. దీనికోసం ఆహారంలో నూనె, కారం, మసాలాలు ఎక్కువగా ఉండే వాటిని పక్కనపెట్టాలి. అలాంటి ఆహారాన్ని తగ్గించాలి. సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేసిన ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా చేస్తే బాడీ సహజంగా డీటాక్స్ అవుతుంది.


ఎక్కువగా నీరు


బాడీని నేచురల్‌గా డీటాక్స్ చేయాలనుకుంటే ఎక్కువగా నీరు తాగాలి. ఎంత ఎక్కువగా నీరు తాగితే అంత మంచి మంచిది. బాడీలోని టాక్సిన్స్ మూత్ర రూపంలో బయటికి వెళ్తాయి. దీనికోసం రోజుకి 5 నుండి 6 లీటర్ల నీరు తాగాలి. దీంతో బాడీలో పేరుకుపోయిన మలినాలు బయటికి వచ్చి బాడీ క్లీన్ అవుతుంది. దీంతో బరువు కూడా తగ్గుతారు.


ఫాస్టింగ్


మనం ప్రతిరోజూ ఏదో ఒకటి తింటే బాడీలో టాక్సిన్స్ ఆటోమేటిగ్గా పేరుకుపోతాయి. కాబట్టి, బాడీ డీటాక్స్ అవ్వడానికి కొద్దిగా ఫాస్టింగ్ కూడా చేయండి. ఒకట్రెండు రోజులు హెవీ మీల్స్ బదులు తేలికైన ఫుడ్ తీసుకోండి. ఈ సమయంలో పండ్లు, కూరగాయలు తినొచ్చు. దీంతో రోజంతా తేలిగ్గా ఉండడమే కాకుండా కడుపు, జీర్ణ వ్యవస్థకి విశ్రాంతి ఇచ్చినవారవుతాం.


ఆకుపచ్చ కూరగాయలు


ఆకుపచ్చ కూరగాయలు తినడం వల్ల కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. వాటిలో బాడీ డీటాక్సీఫికేషన్ ఒకటి. ఆకుపచ్చ కూరగాయల్ని స్మూతీస్, సలాడ్స్ వంటి రూపంలో చేసి తీసుకోవచ్చు. బచ్చలికూర, కాలే, పాలకూర, దోసకాయ వంటివాటిని వాడొచ్చు. వీటితో పాటు క్యారెట్, బీట్‌రూట్ మొదలైనవి కూడా తీసుకోవచ్చు. ఈ డ్రింక్స్‌లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ టాయి. ఇవి బాడీకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్‌ని అందిస్తాయి.


హెర్బల్ డ్రింక్స్


హెర్బల్ డ్రింక్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తీసుకోవడం వల్ల బాడీ డీటాక్స్ అవుతుంది. బాడీలోని టాక్సిన్స్ బయటికి వెళ్లిపోతాయి. దీనికోసం గ్రీన్ టీ, హెర్బల్ టీ మొదలైనవి తీసుకోవచ్చు. ఇది మీ శరీరాన్ని కూడా హైడ్రేట్ చేస్తుంది. మీరు టీ, హెర్బల్ డ్రింక్స్ తీసుకోవడం మంచిది. బ్లాక్ టీ కూడా చాలా మంచిది. మీరు ఈ టీలలో ఏదైనా ఒకటి రోజూ తీసుకోవడం మంచిది. ఒక్కొక్కటైనా తీసుకోవచ్చు. రోజూ రెండు కప్పుల టీ తీసుకోవడం మంచిది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com