శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ దర్శించుకున్నారు. ఈయన సుమారు ఐదు కేజీల బరువు గల బంగారు ఆభరణాలు ధరించి మల్లన్న దర్శనానికి వచ్చారు. పెద్ద గొలుసులు, కంఠాభరణాలు, చేతికి కడియాలు, వేళ్లకు ఉంగరాలు ధరించిన ఆయనను స్థానికులు ఆసక్తిగా చూశారు.